in

ONLY SUCCESS SPEAKS, OTHERS FOLLOWS!

సినిమాలలో మారిపోతున్న విలువలకు ఒక చక్కటి ఉదాహరణ వంటి సంఘటన అక్కినేని, కోదండరామి రెడ్డి మధ్య చోటు చేసుకొంది. నెగటివ్ క్యారెక్టర్లు హీరోలుగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో, గత కాలపు హీరోలు ఎంత బాధ్యతగా ఆలోచించే వారో తెలుసుకోవటం చాల అవసరం. ఇప్పటి వారికీ ఇది చాదస్తంగా అనిపించ వచ్చు. కారెక్టరైజషన్ లోనే కాదు, డైలోగ్స్ లో కానీ, పాటలలో కానీ చిన్న అశ్లీల పదం దొర్లడానికి కూడా ఒప్పుకొనేవారు కాదు అప్పటి హీరోలు. కోదండరామి రెడ్డి డైరెక్షన్ లో అక్కినేని నాగేశ్వర్ రావు గారు నటిస్తున్న “దాంపత్యం” చిత్రం లోని ఒక పాట షూటింగ్ మద్రాసు లోని వి.జి.పి. లో ప్రారంభించారు.

మేక్ అప్ తో స్పాట్ కి వచ్చిన అక్కినేని గారు ఒక సారి పాట విందాము అనగానే, నగారా లో పాట ప్లే చేసారు, పాట వింటున్న అక్కినేని, పాట పల్లవి తరువాత, చరణం లో వచ్చిన ఒక డబల్ మీనింగ్ పదం వినగానే, సడన్ గ కుర్చీ నుంచి లేచి, ఆవేశం తో ఊగిపోతూ , ఇది అక్కినేని నటిస్తున్న చిత్రం, మైండ్ ఇట్, పాటలో ఇటువంటి డబల్ మీనింగ్ లు పెడతారా అంటూ విగ్గు తీసి నేల మీద కొట్టి, రూమ్ కి వెళ్లి పోయారు. హతాశులయిన నిర్మాతలు రూమ్ కి వెళ్లి ఎంత కన్వెన్స్ చేసిన, నో, నేను ఈ సినిమాలో నటించను అని చెప్పి హైదరాబాద్ కి వెళ్లిపోయారు.

ఆ తరువాత కొంత కాలానికి పాటను మార్చి, అక్కినేని గారి కోపం తగ్గాక విషయం చెప్పి, బతిమాలి, మళ్ళీ షూటింగ్ ప్రారంభించారు. మారిన కాలం లో విలన్లే హీరోలుగా , హీరోయిన్లు ఐటెం గర్ల్స్ గ చలామణి అయిపోతున్నారు. ప్రేక్షకుల అభిరుచి మారిందా? డైరెక్టర్ల మైండ్ సెట్ మారిందా? నిర్మాతల క్యాలికులేషన్ మారిందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సినిమా వారిని అడిగితే ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అంటారు, ప్రేక్షకులను అడిగితే, వాళ్ళు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అంటారు. ఏది ఏమయినా, చిత్ర పరిశ్రమలో “విజయం మాత్రమే మాట్లాడుతుంది, మిగతా వారు అనుసరిస్తారు” , ఇదే సత్యం..

jersey beauty Recalls Her Struggle Phase and Suicidal Thoughts!

dj tillu!