in

‘DJ Tillu’s Neha Shetty fires on journalist for sexiest question!

డీజే టిల్లు ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో హీరోయిన్ నేహా శెట్టి పై జర్నలిస్టు సురేష్ కొండేటి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఇలాంటి ప్రశ్నలను అడుగుతారా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హీరోయిన్ పుట్టు మచ్చలు హీరో తెలుసుకున్నాడా అంటూ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికి కోపాన్ని కలిగిస్తున్నాయి. ఈ సమయంలో డీజే టిల్లు చిత్ర నిర్మాత నాగ వంశీ స్పందిస్తూ తమ సినిమా ఈవెంట్‌ సందర్బంగా అలాంటి ఒక అనుభవం ఎదురైంది.. అందుకుగాను తమ వంతు క్షమాపణలు చెబుతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.

నేహా శెట్టి కి ట్విట్టర్ ద్వారా ఆయన క్షమాపణ చెప్పాడు. అయితే ఈ విషయంలో నాగ వంశీ ది కూడా కొంత తప్పు ఉన్నట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన కూడా హీరోయిన్ విషయంలో తప్పుగా వ్యాఖ్యలు చేసాడు అంటున్నారు. మరోవైపు జర్నలిస్టు సురేష్ కొండేటి కూడా తాను సరదాగా ఆ మాట అన్నాను తప్ప ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని అన్నాడు. ఒకవేళ ఎవరైనా బాధపడి ఉంటే అందుకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధం అన్నట్లుగా ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. మొత్తానికి ఈ వ్యవహారం ఇంతటితో అయినా అంతం అవుతుందా లేదా అనేది చూడాలి.

Kajal Aggarwal receives UAE’s prestigious Golden visa!

Telugu Heroine Shruti Sodhi Latest Glamorous Photos!