in

suresh babu Wants ‘Bro-Daddy’ With Venky-Rana?

రానా ఇటీవలే అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు విరాట పర్వం సినిమాతో సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రానా నక్సలైట్ గా కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు రానా, వెంకటేష్ ఇద్దరు కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారని ఈ మధ్య టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

అలాగే ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. మలయాళంలో విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకున్న ‘బ్రో డాడీ’ సినిమా సురేశ్ బాబుకి నచ్చిందట. దాంతో ఆయన ఈ సినిమాను వెంకటేశ్ – రానా ప్రధానమైన పాత్రలుగా రీమేక్ చేయాలనీ చూస్తున్నారట. మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్ లాల్ – పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. మోహన్ లాల్ సరసన మీనా .. పృథ్వీరాజ్ జోడీగా కల్యాణి ప్రియదర్శన్ కనిపించనున్నారు. ఇప్పుడు ఈ సినిమాను వెంకీ రానాచేయనున్నారట.ఈసినిమా కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది.

Urvashi Rautela in backless gown at Femina Women Awards!

viral : ashu Reddy gives A Kiss On Ariyana’s Waist!