in

Siri Mind Blank for Ariyana’s Questions about extreme hugs!

సిరి హన్మంత్ బిగ్ బాస్ జర్నీని, బిగ్ బాస్ ఎక్స్‌పీరియెన్స్ గురించి తెలుసుకునేందుకుగాను సిరిని.. అరియానా తాజాగా ఇంటర్వ్యూ చేసింది.ఈ క్రమంలోనే అరియానా ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ చెప్పింది సరి. స్టార్టింగ్ స్టార్టింగే అరియానా షణ్ముక్ జస్వంత్ ఫొటో డిస్ ప్లే చేసి.. అతనికి ఏం చెప్పాలో చెప్పు అని అడిగింది. అలా అరియానా ఇచ్చిన ఝలక్ చూసి.. సిరి ఏం తెలియనట్లే బిహేవ్ చేసింది.

సీజన్ మొత్తం హగ్గుల యుద్ధం జరిగిందని అరియానా చెప్పకనే చెప్పింది. అలా అరియానా చెప్తుండగా సిరి నవ్వుతుండటం గమనార్హం.ఇకపోతే షణ్ణుకు ఐలవ్ యూ చెప్పావా ఏంటి అని అరియానా సిరిని అడిగింది. దానికి సమాధానంగా సిరి ఫ్రెండ్స్‌కు ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారా అని అడిగింది. అయితే, స్నేహం ముసుగులో షణ్ముక్ జస్వంత్, సిరి హన్మంత్ హద్దులు దాటిపోయారనే అభిప్రాయం సీజన్ మొత్తం చూసిన వారందరికీ అర్థమయి ఉంటుంది.

అయితే, ఇవేవీ పట్టించుకోకుండా సిరి తన స్నేహం గురించే మాట్లాడుతోంది. హౌజ్‌లో ఉన్నంత సేపు ఎప్పుడూ షణ్ణుతోనే ఉండింది సిరి. ఈ క్రమంలోనే తనతో ఎప్పుడూ ఉండాలనిపిస్తోందని సిరి షణ్ముక్ జస్వంత్‌కు చెప్పింది కూడా. ఇక షణ్ముక్ సైతం సిరి ఎలిమినేట్ అయిన తర్వాత అలా డోర్ వద్ద కూర్చొని ఏడ్చేశాడు. మొత్తానికి సిరి-షణ్ముక్ మధ్య ఏముందో అనే అన్ని ప్రశ్నలకు సిరి దాదాపుగా దాటవేసిందని చెప్పొచ్చు. ఓన్లీ ఫ్రెండ్ షిప్ అని చెప్తూ ముందుకు సాగింది.

Rakul Preet latest comments On Marriage With Jackky Bhagnani!

rashmika mandanna says ‘a big no’ to item songs!