బాడీషేమింగ్ విషయంలో ఎదురవుతున్న వివక్ష, విమర్శలను కెరీర్ ఆరంభం నుంచి ధీటుగా ఎదుర్కొంటున్నది బాలీవుడ్ కథానాయిక సోనాక్షిసిన్హా. బొద్దుగా ఉండే సోనాక్షిసిన్హా హీరోయిన్ పాత్రలు చేయడానికి సరిపోదంటూ సామాజిక మాధ్యమాల్లో ఆమెపై చాలా సార్లు నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. ఈ విమర్శలకు గట్టిగానే బదులిస్తూ వచ్చిందామె. తాజాగా బాడీషేమింగ్ సమస్యలపై ‘డబుల్ ఎక్స్ఎల్’ పేరుతో సోనాక్షి ఓ సినిమా చేయబోతున్నది. అధిక బరువుతో బాధపడే మహిళలకు సమాజం..
కుటుంబ పరంగా ఎదురవుతున్న అవహేళనలు, వివక్షను చర్చిస్తూ ్త ఈ సినిమా తెరకెక్కబోతున్నది…సోనాక్షి సిన్హాతో పాటుఈ సినిమాలో హ్యుమాఖురేషి మరోనాయికగా నటించబోతున్నది. మంగళవారం విడుదలచేసిన ప్రచార చిత్రంలో సోనాక్షి, హ్యుమా మధ్య సాగిన సంభాషణలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ‘నిన్ను మోటాక్షి అని పిలిచిన రోజులను మర్చిపోయావా’..‘బొద్దుగుమ్మగా మారిన హ్యుమాఖురేషి’ అంటూ సినీ పరిశ్రమలో తమకు ఎదురైన విమర్శల్ని వారే స్వయంగా డైలాగ్స్ రూపంలో చెప్పడం ఆకట్టుకుంటున్నది. ఈ సినిమా కోసం సోనాక్షి సిన్హా, హ్యుమాఖురేషి బరువు పెరిగినట్లు సమాచారం. సత్రమ్మ్రణి దర్శకత్వం వహిస్తున్నారు.