టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పెద్ద మనసు చాటుకున్నాడు. ఓ పేద కుటుంబానికి చెందిన నేపాలీ బాలికను దత్తత తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ స్వయంగా వెల్లడించాడు. కనీసం పాపకు సరైన పోషకాహారం కూడా ఇవ్వలేని స్థితిలో ఓ కుటుంబం ఉందన్న విషయం తెలుసుకుని… ఆ పాపను తాను దత్తత తీసుకున్నానని బండ్ల గణేష్ ప్రకటించాడు. సదరు పాప ఏడుస్తుంటే ఎవరూ పట్టించుకోకపోవడాన్ని తన భార్య చూసిందని..తన భార్య సూచన మేరకు పాపను దత్తత తీసుకున్నట్లు బండ్ల గణేష్ వివరించాడు.
ఇప్పుడు ఆ పాప తన ఇంట్లో ఓ మెంబర్ అయిపోయిందని.. ఏకంగా ఆ పాప తమనే బెదిరిస్తుందని సరదాగా చెప్పాడు. అందరూ కుక్కలు, పిల్లులను పెంచుకుని వాటికి చాలా డబ్బులు ఖర్చుపెడుతుంటారని.. తాను మాత్రం ఈ పాపను పెంచుకుని మంచిగా చదవించి వృద్ధిలోకి తేవాలని నిర్ణయం తీసుకున్నానని బండ్ల గణేష్ తెలిపాడు. కాగా బండ్ల గణేష్ చేసిన మంచి పనికి సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బండ్ల గణేష్ మంచి మనసు చాటుకున్నాడని పలువురు కొనియాడుతున్నారు.