in

Ram Charan’s grand entry into electronic media?

ప్ప‌టి హీరోలు ఆర్థిక సూత్రాల్ని బాగా వంట‌ప‌ట్టించుకుంటున్నారు. సొంతంగా సినిమాలు తీస్తూ… నిర్మాణ రంగాన్ని శాశిస్తున్నారు. ఇంకొంత మంది ర‌క‌ర‌కాల వ్యాపారాలు చేస్తున్నారు. రామ్ చర‌ణ్ కూడా నిర్మాణ రంగంలో ఉన్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ‌ని స్థాపించి సినిమాలు తీస్తున్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న మీడియా రంగంలో కూడా అడుగుపెట్ట‌బోతున్న‌ట్టు టాక్‌.

రామ్ చ‌ర‌ణ్ ఓ టీవీ ఛాన‌ల్ ని కొంటున్నార‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. `మ‌హా టీవీ` పేరుతో ఓ టీవీ ఛానల్ ర‌న్ అవుతుంది. అయితే కొన్నాళ్లుగా ఈ సంస్థ న‌ష్టాల్లో న‌డుస్తోంది. అందుకే ఈ టీవీ ఛాన‌ల్ ని బేరానికి పెట్టారు. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ దృష్టి ఈ టీవీ ఛాన‌ల్ పై ప‌డింద‌ని తెలుస్తోంది. చేతిలో ఓ టీవీ ఛాన‌ల్ ఉంటే త‌మ సినిమాల‌కూ, బాబాయ్ `జ‌న‌సేన‌` పార్టీకి ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని చ‌ర‌ణ్ అనుకుంటున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం బేరాలు జ‌రుగుతున్నాయ‌ని, త్వ‌ర‌లోనే మ‌హా.. మెగా సొంతం అవుతుంద‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌.

paramukha gayaniki chematalu pattinchina paata!

Sister sentiment in ‘Pushpa’, varsha as Bunny sister!