in

Sister sentiment in ‘Pushpa’, varsha as Bunny sister!

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో పుష్పరాజ్ చెల్లెలి పాత్రలో యంగ్ హీరోయిన్ నటించనున్నట్లుగా సమాచారం. పుష్ప సినిమాలో బన్నీ చెల్లెలుకు సంబంధించిన సెంటిమెంట్ ఉంటుందని.. చెల్లెలి రోల్ సినిమాలో ప్రధాన భాగమని అంటున్నారు. ఈ పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్‏ను ఎంపిక చేశారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ రోల్ కోసం వర్ష బొల్లమ్మను సెలక్ట్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. వర్ష తెలుగులో రెండు సినిమాలు చేసింది.

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో హీరోయిన్‏గా నటించింది. తాజాగా పుష్ప సినిమాలో ఛాన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాలంటి మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ఇప్పటికే ఈ సినిమా 80 శాతం షూటింగ్ పూర్తైనట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ‘పుష్ప’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్టులో జరుగుతోంది. మరో వారం రోజుల పాటు ఈ షెడ్యూలు కాకినాడలో కొనసాగుతుంది. అలాగే ఈ మూవీని డిసెంబర్ 17న విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్.

Ram Charan’s grand entry into electronic media?

laxmi raai exposing her thighs!