in

Venky mama And Rana Joins Together For Netflix Web Series!

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సౌత్ లో ఒరిజినల్ కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఆంథాలజీ కథలను నిర్మిస్తోంది. ఇటీవల కోలీవుడ్ స్టార్స్ అంతా కలిసి నటించిన ‘నవరస’ ఆంథాలజీ డ్రామాను నెట్ ఫ్లిక్స్ లోనే విడుదల చేశారు. ఇందులో మూడు కథలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ మరిన్ని ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతోంది. ఈ క్రమంలో రానా దగ్గుబాటి-వెంకటేష్ లతో కలిసి ఓ వెబ్ సిరీస్ నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది.

ఇటీవల నెట్ ఫ్లిక్స్ సంస్థతో మంతనాలు జరిపిన రానా తన బాబాయ్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ మధ్యకాలంలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమవుతున్నారట. అయితే దీన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థతో కలిసి రానా వెబ్ సిరీస్ నిర్మించాలనుకోవడం విశేషం. అందులో వెంకటేష్ కూడా నటిస్తుండడంతో బజ్ ఏర్పడింది. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.

can you guess the first onscreen appearance of our star heroes!

radhika Apte Turns Cosmopolitan Girl!