గుమ్మడి వెంకటేశ్వర రావు, యాభై సమ్వత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానం లో అయన 500 చిత్రాలలో నటించారు, మొదటి నుంచి అయన ముసలి, నడి వయసు క్యారెక్టర్ లే చేయటం విశేషం.వయసులో తనకంటే పెద్ద వారయిన హీరోలకు తండ్రి గ, అన్న గ నటించారు గుమ్మడి గారు. అయన చిత్ర సీమకు వచ్చినప్పుడు పంచెకట్టుతో ఉండే వారు, “జై వీర భేతాళ” అనే చిత్రంలో హీరో వేషం వచ్చింది దురదృష్ట వశాత్తు నిర్మాత చనిపోవటం తో సినిమా ఆగిపోయింది. ఆ తరువాత వేషాల వేటలో ప్యాంట్లు, షర్ట్ లు వేసుకోవటం మొదలు పెట్టారట.
ఒక రోజు త్రిపురనేని గోపీచంద్ గారు గుమ్మడి గారిని చూసి చనువు కొద్దీ ఇదేం పోయే కాలం ప్యాంట్లు షర్ట్ లోకి దిగావు, అని అడిగారట. హీరో వేషాల కోసం ప్రయత్నిస్తున్నాను అని చెప్పారట, నీ పర్సనాలిటీ కి హీరో వేషాలలో రాణించటం కష్టం, హీరోగా అయితే నీ కెరీర్ చాల లిమిటెడ్, అదే క్యారక్టర్ నటుడిగా స్థిరపడితే నీ కెరీర్ సుదీర్ఘ కాలం ఉంటుంది, అని సలహా ఇచ్చారట. అదే నిజం అయింది గుమ్మడి గారు ఐదు దశాబ్దాలు సినీ ప్రయాణం కొనసాగింది.