in

Mahesh Babu takes green initiative to celebrate his birthday!

హేష్ బాబు ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి 22 ఏళ్ళు పూర్తైన, వయసు 45 ఏళ్ళు దాటినా చెక్కు చెదరని అందంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రిన్స్ గా పిలుచుకునే తన అభిమానులు, డ్రీమ్ బాయ్ గా ఊహించుకునే అమ్మాయిలు చాలానే ఉన్నారు. వరుస సినిమా హిట్లతో మంచి జోరు మీదున్న మహేష్ బాబు ఆగష్టు9 న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక విన్నపాన్ని తెలిపాడు.

సాధారణంగా అభిమాన నటుడి పుట్టినరోజులు అభిమానులు రక్తదానాలు, పాలాభిషేకాలు, పెద్ద పెద్ద కటౌట్ లనూ ఏర్పాటు చేసి కేకులను కట్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతారు. కాని ఈసారి మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు మాత్రం కొంత డిఫరెంట్ గా జరగనున్నాయి. నేడు ట్విట్టర్ మరియు ఇన్స్టా గ్రామ్ లో మహేష్ బాబు తన అభిమానులకు తన పుట్టినరోజున మొక్కలను నాటాలని అభ్యర్థించాడు.

తన ఇన్స్టాగ్రామ్ లో మహేష్ ఇలా పోస్ట్ చేశాడు “మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేనెప్పుడు విధేయుడిగా ఉంటానని, ఈ సంవత్సరం నా 46వ పుట్టినరోజు సందర్భంగా నా అభిమానులకు ఒక విన్నపం అని చెప్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మద్దతుగా ఆగష్టు9 న ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటాలని మీ అందరినీ కోరుతున్నట్లు” తెలిపాడు.

gummadi garu kevalam musali veshalaku parimitham kaavatam venukunna kaaranam!

kanche beauty Pragya Jaiswal’s Glam Photoshoot!