in

Anchor Suma Divorce, Rajeev Kanakala shuts the rumours!

సుమ‌-రాజీవ్ క‌న‌కాల జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. ప‌లు షోస్‌కి వీరిద్ద‌రు హాజ‌రు కాగా, ఆ స‌మ‌యంలో వీరు చెప్పిన ముచ్చ‌ట్లు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. వీరి వివాహం జ‌రిగి దాదాపు పాతికేళ్లు కావొస్తుండ‌గా, వీరి వివాహానికి గుర్తుగా ఓ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. అయితే ఈ మ‌ధ్య ఈ ఇద్ద‌రి మ‌ధ్య పొర‌ప‌చ్చాలు వ‌చ్చాయ‌ని, విడాకులు తీసుకోబోతున్నారంటూ జోరుగా ప్ర‌చారం న‌డిచింది.

హైదరాబాద్‌లోనే ఉంటూ ఇద్దరూ వేరువేరు ఇళ్లల్లో ఉండటం ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజీవ్‌ కనకాల.. ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. సుమ‌తో నేను కొద్ది రోజుల పాటు దూరంగా ఉన్న మాట వాస్త‌వం. అమ్మ చనిపోయిన త‌ర్వాత నాన్న ఒక్క‌రే మ‌ణికొండ‌లోని సొంతింట్లో ఉండేవారు. నాన్న‌ని మా ప్లాట్‌కి తీసుకొద్దాం అంటే ఆయ‌న బుక్ లైబ్రరీ చాలా పెద్ద‌గా ఉండేది. దానిని మా ఫ్లాట్ లోకి షిఫ్ట్ చేయ‌డం క‌ష్టం అయింది.

ఈ కార‌ణంగానే మా నాన్న నాతో పాటు మ‌ణికొండ‌లో ఉన్నాను. ఇది కార‌ణం త‌ప్ప సుమ‌, నేను విడిపోవ‌డం కాదు. త్వరలోనే విడాకులు తీసుకుంటారు అంటూ ఏవేవో వార్తలు రాశారు. అందులో ఏమాత్రం నిజం లేదు. మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు’ అంటూ రాజీవ్‌ పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం రాజీవ్ కెరియ‌ర్ మంచి స్పీడ్‌లోనే ఉంది. ఇటీవ‌ల నార‌ప్ప‌లో క‌నిపించిన రాజీవ్.. ఆర్ఆర్ఆర్ చిత్రంలోను క‌నిపించ‌నున్నాడు..

big boss beauty himaja latest clicks!

Amy jackson split up with her boy friend after having a son!