in

Hansika to star in first ever one-shot film in tollywood!

కెరీర్‌ ఆరంభం నుంచి గ్లామర్‌ పాత్రల్లో మెప్పిస్తోన్న కథానాయిక హన్సిక గత కొంతకాలంగా అభినయ ప్రధానమైన పాత్రల వైపు దృష్టిపెడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో ‘105 మినిట్స్‌’ పేరుతో తెరకెక్కుతున్న ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది. ఎలాంటి ఎడిటింగ్‌ లేకుండా సింగిల్‌షాట్‌లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఒక ఇంట్లో జరిగే సంఘటనలతో సాగే సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ఇది. హన్సిక ఏక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నిడివి కూడా 105 నిమిషాలే కావడం విశేషం.

ప్రయోగాత్మక చిత్రంలో నటించడం పట్ల హన్సిక ట్విట్టర్‌లో ఆనందం వ్యక్తం చేసింది. ‘వినూత్నమైన కథాంశంతో రూపొందుతున్న చిత్రంలో భాగం కావడం సంతోషంగా ఉంది. రియల్‌టైమ్‌లో ఒకే షాట్‌లో తీసే ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు చక్కటి అనుభూతినందిస్తుంది. నా కెరీర్‌లో ప్రత్యేకంగా మిగిలిపోతుంది’ అని హన్సిక పేర్కొంది. ఈ చిత్రానికి రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హన్సిక నటించిన ‘మహ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Rashmi Gautam Sizzles In Black Saree!

‘Chatrapathi’ VANDA ROJULA FUNCTION LO GODDALLU ICHINA NIRMATHA!