in

rockstar dsp to turn hero with a crazy entertainer!

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన మ్యూజిక్ ఇస్తున్నారంటే చాలు సినిమా సగం సక్సెస్ అనే భావనలో ప్రేక్షకులు ఉండిపోతారు. దేవిశ్రీ సంగీతంతో పాటుగా అప్పుడప్పుడు సినిమాల్లోనూ తళుక్కున మెరుస్తున్నారు. అయితే ఆయన హీరోగా పరిచయం కాబోతున్నట్లు గతంలోనే చాలాసార్లు వార్తలు వచ్చాయి.

అయినా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు..అయితే తాజాగా దేవిశ్రీని హీరోగా పరిచయం చేసేందుకు నటి, నిర్మాత ఛార్మి సన్నాహాలు చేస్తుందట. ఆయన హీరోగా ఓ హారర్ చిత్రాన్ని నిర్మించడానికి ఛార్మి ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఛార్మి ‘లైగర్’ ను నిర్మించడంలో బిజీగా ఉంది. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ముగించనున్న నేపథ్యంలో ఛార్మి తన తదుపరి ప్రాజెక్ట్ పై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

sai pallavi rocks it with ‘Saranga Dariya’!

balayya, nag multi starrer cinema nu pakkaku pettesina bellamkonda!