in

kalyan ram gives green signal to another periodic movie!

దైనా కొత్త ఎలిమెంట్ ఉంటే తప్ప సినిమాలు ఒప్పుకోవడం లేదు.ఈ క్రమంలో ఆయన వద్దకు వస్తోన్న పీరియాడిక్ సినిమాలపై ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘బింబిసార’ అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నాడు కళ్యాణ్ రామ్. మల్లిడి వేణు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీన్ని రెండు భాగాలుగా చిత్రీకరిస్తారని అంటున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన చిన్న వీడియోను విడుదల చేశారు.

భారీ బడ్జెట్ తో వీఎఫ్ఎక్స్ ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాటు కళ్యాణ్ రామ్ మరో పీరియాడిక్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. 1950 బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఒక కథను ఇటీవల నిర్మాత అభిషేక్ నామా ఓకే చేసినట్లు తెలుస్తోంది. నవీన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందించబోతున్నాడు. ఇందులో కళ్యాణ్ రామ్ ను హీరోగా అనుకుంటున్నారు. ఈ ఏడాది ఆఖరులో సినిమాను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ షూటింగ్ ను పూర్తి చేస్తాడు.

thapsee pannu sensational comments on her producers!

pooja hegde completes her part for ‘radhe shyam’!