RGV, అరియనా రీసెంట్ గా చేసిన జిం ఇంటర్వ్యూ బయటకొచ్చింది. తన కూతురు కంటే చిన్న వయసు అమ్మాయితో అత్యంత అభ్యంతరకరంగా, అసహ్యకరంగా వర్మ మాట్లాడారనీ కొంతమంది విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో అరియనా స్పందించింది. ఆర్జీవీతో అంతసేపు ఇంటర్వ్యూ చేయడమే ఓ పెద్ద టాస్ అని.. తనకు ఈ ఇంటర్వ్యూ ప్లస్ అవుతుందేమో కానీ ఆయనకు మాత్రం మామూలే అని చెప్పుకొచ్చింది .
అందరూ బోల్డ్ ఇంటర్వ్యూ అంటున్నారు కానీ అందులో బోల్డ్ ఏముందో తనకు అర్ధం కావడం లేదని చెప్పుకొచ్చింది. ఒకవేళ ఆర్జీవీ అమ్మాయిలను వేధించే టైప్ అయితే.. ‘మీటూ’లో ఆయన పేరు ఉండేదిగా.. ఎవరన్నా ఆయనపై ఫిర్యాదు చేశారా..? అంటూ తన గురువుని సపోర్ట్ చేస్తూ మాట్లాడుకొచ్చింది. ఈ ఫీల్డ్ లో సక్సెస్ అవ్వాలంటే కోపగించుకోకూడదని.. కోపం వల్ల సాధించేదేమీ లేదు కాబట్టి రాజీ పడాల్సిందే.. అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.