in

Boyapati Srinu in talks for a bilingual with Suriya?

బోయపాటి తాజా చిత్రంగా ‘అఖండ’ సెట్స్ పై ఉంది. బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’ .. ‘లెజెండ్’ సంచలన విజయాలను నమోదు చేయడంతో, సహజంగానే ఈ సినిమాను గురించి ఒక రేంజ్ లో ఊహించుకుంటున్నారు. ఇటీవల వచ్చిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఈ సినిమాపై మరింతగా ఆసక్తి పెరుగుతోంది. దసరాకి ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ తో బోయపాటి సినిమా ఉండవచ్చని అంతా అనుకుంటున్నారు. ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే హీరో సూర్యకు కూడా బోయపాటి ఒక  కథను వినిపించినట్టుగా చెప్పుకుంటున్నారు. కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. నేరుగా తెలుగులో రూపొందే ఈ సినిమా, తమిళంలోనూ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అల్లు అర్జున్ ప్రాజెక్టు ఆలస్యమైతే ముందుగా సూర్యతోనే బోయపాటి సినిమా ఉంటుందనే టాక్ బలంగానే వినిపిస్తోంది.

Kajal Agarwal shines in pink on the red carpet!

jabardasth ladies anasuya and rashmi team up for web series!