in

Senior Actor Chandra mohan Announces Retirement!

మధ్య సినిమాలు బాగా తగ్గించేయడానికి కారణమేంటి అని చంద్రమోహన్‌ను అడిగితే.. ‘‘ఇందుకు ముఖ్య కారణం.. నా ఆరోగ్యం. దాదాపు 50 సంవత్సరాలు నిర్విరామంగా పని చేసి, నా ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేశా. ఆరోగ్యం విషయంలో ఎవరైనా హెచ్చరించినా ..ఇనుముకు చెదలు పడుతుందా అంటూ వెటకారం చేసేవాడిని. కానీ, నా నిర్లక్ష్యమే నన్ను దెబ్బ తీసింది. నా వల్ల షూటింగ్స్ ఆగి నా నిర్మాతలు ఇబ్బందిలో పడటం నాకు ఇష్టం లేక కొన్నిసార్లు అవసరానికి మించి రిస్క్ చేశాను.

‘రాఖీ’ సినిమాలో ఎమోషనల్ సీన్ చేసిన తర్వాత..బైపాస్ సర్జరీ కోసం నేరుగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అలాగే, ‘దువ్వాడ జగన్నాథం’ షూటింగ్ సైతం నా అనారోగ్యం వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. అందుకే ఇక రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను’’ అన్నారు. తాను ఇకపై సినిమాల్లో నటించకపోయినా.. ఎప్పుడూ ప్రేక్షకులకు తనను గుర్తు చేసేలా సినిమాలు ఎక్కడోచోట వస్తూనే ఉంటాయని చంద్రమోహన్ అన్నారు. ‘

yemi thinakunda 16 gantalu yekadhaatiga shooting chesina ntr!

koratala siva gives clarity on chiru charan relationship in acharya!