ఈ సీరియల్ కథ ఏంటంటే దీప అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని అనుమానంతో వదిలేస్తాడు డాక్టర్ బాబు. ఆమెకు పుట్టిన కవలలు చివరకు తల్లిదండ్రులను ఎలా కలిపారనే నేపథ్యంతో ఈ సీరియల్ తీస్తున్నారు. తాజా ఎపిసోడ్లో డాక్టర్ బాబుకు అసలు నిజం తెలుస్తుంది. దీంతో ఎన్నడూ లేని విధంగా కన్నీరు పెట్టుకుంటాడు. ఈ సీరియల్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా భావోద్వేగాలను పండిస్తూ మహిళలతో కన్నీరు పెట్టిస్తూ ఈ సీరియల్ కొనసాగుతోంది.
మొదటి సారి డాక్టర్ బాబు కన్నీరు పెట్టుకోవడంతో సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చివరకు మంచు లక్ష్మి కూడా దీనిపై ట్వీట్ చేసిందంటే ఈ సీరియల్కు సెలబ్రిటీల ఇంట్లో కూడా ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. కాగా, మరికొందరు నెటిజన్లు డాక్టర్ బాబు కన్నీరు పెట్టుకోవడంపై సెటైర్లు వేస్తున్నారు. స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ సూపర్ డూపర్ హిట్ సీరియల్ గురించే మహిళలంతా చర్చించుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు..