విజయ సంస్థ నిర్మించిన మొదటి నాలుగు చిత్రాలకు ఘంటసాల గారు నేపధ్య గానమే కాకుండా, సంగీత దర్శకత్వం కూడా నిర్వహించారు. విజయ సంస్థ నిర్మించిన అయిదవ చిత్రం అయిన మిస్సమ్మ చిత్రంలో కనీసం ఒక్క పాట కూడా పాడలేదు. మిస్సమ్మ చిత్ర దర్శకుడు అయినటువంటి ఎల్.వి. ప్రసాద్ గారు సాలూరి రాజేశ్వర్ రావు గారు సంగీత దర్శకుడిగా కావాలని పట్టు పట్టడం తో ఆయన మాటే నెగ్గింది. ఆ కోపం తో ఘంటసాల గారు ఆ చిత్రంలో పాటలు పాడటానికి కూడా అంగీకరించలేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఘంటసాల గారు ఒప్పుకోక పోవటం తో ఆ చిత్రంలో యెన్,టి.ఆర్. మీద చిత్రీకరించిన పాటలను, ఏ.ఏం. రాజా గారి తో పాడించటం జరిగింది. ఘంటసాల గారి గాత్రం వినిపించని విజయ వారి ఏకైక చిత్రం మిస్సమ్మ..