in

ANNA GARI BAATALO NADICHI NATUDAYINA TAMILA SUPER STAR!

మిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సినిమా యాక్టర్ అవ్వడానికి పరోక్షంగా మన నందమూరి తారక రామ రావు గారు కారణం. రజనీకాంత్ గారు కండెక్టర్ గ పని చేస్తున్న రోజుల్లో ఆయన యెన్.టి.ఆర్. గారికి వీర అభిమాని, యెన్.టి.ఆర్. నటించిన ” మాయ బజార్ “, ” శ్రీ కృష్ణ పాండవీయం ” వంటి చిత్రాలు లెక్క లేనన్ని సార్లు చూసారు. రజని కండెక్టర్ గ పనిచేస్తున్న రోజుల్లో స్టాఫ్ అంత కలసి ఒక డ్రామా వేశారు అందులో రజని కి దుర్యోధనుడి పాత్ర ఇచ్చారు.

రజని ” శ్రీ కృష్ణ పాండవీయం” సినిమా చూసి,అన్నగారి ఇన్స్పిరేషన్ తో, ఆ డ్రామాలో దుర్యోధనుడి పాత్ర నటన అదరగొట్టారు. స్టాఫ్ అందరు మెచ్చుకున్నారు, సినిమాల్లో ప్రయత్నించమని, ప్రోత్సహించారు, ఆ సమయం లోనే మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రకటన చూసిన రజని, స్నేహితుడి ప్రోత్సాహం, ఆర్ధిక సహాయం తో ఇన్స్టిట్యూట్ లో చేరి, బాలచందర్ గారి ఆశీర్వాదం తో నటుడిగా రంగ ప్రవేశం చేసారు. భారత దేశం గర్వించతగ్గ నటుడిగా ఎదిగారు..

bad luck still continues for rakul preet singh!

Big Boss-4 fame Divi’s ‘Cab Stories’ on sparks ott soon!