in

Radhika Apte breaks silence on nude video leak!

రాధికా ఆప్టే..ఈ పేరు ఎఫ్పుడూ ఓ సంచలనమే. ఆమె చేసే పాత్రలు సంచలనాత్మకంగా ఉంటాయి. అలాగే ఆమె మాట్లాడే మాటలూ సంచలనం రేపుతుంటాయి. కొన్నేళ్ల కిందట ఆమె న్యూడ్ క్లిప్ ఒకటి లీక్ అయి ఇంటర్నెట్లో వైరల్ కావడం తెలిసిందే. ‘క్లీన్ షేవెన్’ అనే షార్ట్ ఫిలింకి సంబంధించిన క్లిప్ అది. దాని గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకున్నారు. రాధికను సోషల్ మీడియాలో విపరీంగా ట్రోల్ చేశారు. ఐతే రాధిక మనస్తత్వం ప్రకారం చూస్తే ఇలాంటివి ఆమె పెద్దగా పట్టించుకోదని, లైట్ తీసుకునే ఉంటుందని అనుకుంటారంతా.

కానీ ఆ వీడియో లీక్ కావడం తనను బాగానే ఇబ్బంది పెట్టిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది రాధికా. ఆ టైంలో సోషల్ మీడియాలో ఎవరేమంటున్నారు.. మీడియా వాళ్లు ఏం రాస్తున్నారు అన్నది తాను పెద్దగా పట్టించుకోలేదని.. కానీ తన చుట్టూ ఉన్న వాళ్లే అదో రకంగా చూడటం వల్ల ఇబ్బందికి గురయ్యానని రాధిక చెప్పింది. వీడియోలో ఉన్నది తానే అని గుర్తించి.. తమ వాచ్‌మ్యాన్, డ్రైవర్ లాంటి వాళ్లు అదోలా చూడటం మొదలుపెట్టారని.. వాళ్లను ఫేస్ చేయలేక తాను నాలుగు రోజుల పాటు ఇంటికే పరిమితం అయ్యానని రాధిక చెప్పింది..

upenna director Buchi Babu and Jr NTR to tell a local story globally!

dimple hayathi’s all the family members have contracted the virus!