in

jhanvi kapoor to make her tollywod debut with mahesh babu trivikram movie!

గ‌తంలో జాన్వీ క‌పూర్ తెలుగు సినిమాలోకి రావాల‌ని తెగ ప్ర‌య‌త్నాలు చేసింది. శ్రీ‌దేవి బ‌తికి వుండ‌గానే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అప్ప‌ట్లోనే సూప‌ర్‌స్టార్‌తో చేయ‌బోతుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఎందుక‌నో కార్య‌రూపం దాల్చ‌లేదు. కానీ ఇప్పుడు అదే కోరిక నెర‌వేర‌బోతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి ప‌లువురునాయిక‌లు తెలుగులో వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇక్క‌డ చేశాక బాలీవుడ్ వైకు వెళ్ళి స్థిర‌ప‌డిన‌వారు వున్నారు.

ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం జాన్వీ కపూర్‌ను త‌మ సినిమాలో నాయిక‌గా తీసుకోవాల‌ని హారిక అండ్ హాసిని క్రియేన్స్ నిర్మాణ సంస్థ నిర్ణ‌యానికి వచ్చిన‌ట్లు తెలిసింది..ఇందుకు న‌మ్ర‌త గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి కలసి 30కి పైగా సినిమాల్లో జోడీ కట్టారు. వాటిలో చాలా వరకు హిట్ చిత్రాలే. మ‌రి శ్రీ‌దేవి కుమార్తెగా ఆమె రంగ ప్ర‌వేశం చేయ‌డం లాభిస్తుందేమో చూడాలి. ఇప్ప‌టికీ ఒక‌సారి మిస్ అయిన జాన్వీ ఈసారి మిస్ కాకుండా వుంటుంద‌ని ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాలు చెబుతున్నాయి.

‘Pushpa’ based mostly on Mani Ratnam’s ‘Villain’ film story?

Thalapathy Vijay to do a straight Telugu film soon?