in

shooting spot lo shobhan babu bugga midha muddhu pettina lady fan!

ర్పయాగం సినిమా షూటింగ్ త్యాగరాయ గాన సభలో జరుగుతుంది, అందరు ఎవరి హడావిడిలో వారు ఉన్నారు, ఇంతలో జనం లో నుంచి ఒక అమ్మాయి, తన చేతిలోని బిడ్డను భర్తకు అందించి, ఒక్క ఉదుటున వచ్చి శోభన్ బాబు గారిని కౌగలించుకుని, బుగ్గ మీద ముద్దు పెట్టేసింది, అందరు నిశ్చేష్టులయి చూస్తుండగానే, తేరుకున్న శోభన్ బాబు గారు చుట్టూ చూసారు. బిడ్డను ఎత్తుకొని ఇబ్బందిగా చూస్తున్న ఆ అమ్మాయి భర్తను గుర్తించి , దగ్గరకు పిలిచి నవ్వుతు ఏంటయ్యా నీ భార్య నన్ను ముద్దు పెట్టుకుందని కోపం గ ఉందా అంటూ అతని చేతిని తన చేతిలోకి తీసుకొని..

ఆ అమ్మాయి నా కూతురితో సమానం, అభిమానానికి హద్దులు, వరుసలు, ఉండవయ్యా . నన్ను ప్రత్యేక్షంగా చూడగానే ఒక్క సారిగా ఉద్వేగానికి లోనయిన నీ భార్య ఆలా చేసింది, అది ఆమెకు నా పట్ల ఉన్న వాత్సల్యం మాత్రమే, తప్పుగా అర్ధం చేసుకోకు అన్న శోభన్ బాబు గారి సంస్కారానికి , అతను అదేమీ లేదండి అంటూ సర్దుకున్నాడు. ఆ తరువాత వారితో కాసేపు గడిపిన శోభన్ బాబు గారు వారితో కొన్ని ఫోటోలు కూడా తీసుకొని, వారికీ వీడ్కోలు పలికారు..

Ileana breaks silence on pregnancy and abortion rumours!

Anil Ravipudi Multi starrer with Ravi Teja and Ram Pothineni?