in

Anil Ravipudi Multi starrer with Ravi Teja and Ram Pothineni?

ప్ప‌టికే వ‌రుణ్ తేజ‌, వెంక‌టేశ్ తో మ‌ల్టీ స్టార‌ర్ సినిమా తీసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ఎఫ్‌3 తీస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు ఈ క్రేజీ డైరెక్ట‌ర్‌. త్వ‌ర‌లోనే మ‌రో మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌, మాస్ మ‌హారాజ ర‌వితేజ‌తో క‌లిసి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడంట‌.

ఇప్ప‌టికే ర‌వితేజ‌తో రాజా ది గ్రేట్ సినిమా తీశాడు. ఈ ప‌రిచ‌య‌మే మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు ర‌వితేజ‌ను ఒప్పించిందంట‌. ఇక రామ్ కు కూడా క‌థ వినిపించాడ‌ని స‌మాచారం. వీరిద్ద‌రూ ఒప్పుకోవ‌డంతో త్వ‌ర‌లోనే సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఎవ‌రి సినిమాల‌తో వారు బిజీగా ఉన్నారు. వీరి సినిమాలు పూర్తియిన వెంట‌నే ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌నున్న‌ట్టు స‌మాచారం. చూడాలి మ‌రి ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమా ఎలా ఉంటుందో..

shooting spot lo shobhan babu bugga midha muddhu pettina lady fan!

anchor suma responds on negative comments On Calf Video!