in

jr ntr costly gift to his wife lakshmi pranathi!

నందమూరి నట వారసుడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నే తెలుగు తెరకు పరిచయమైన ఎన్టీఆర్ 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిపోయారు. తన కెరీర్ పీక్ స్టేజిలో ఉన్న సమయంలో లక్ష్మీ ప్రణతిని పెళ్ళి చేసుకున్నారు. ఈ మధ్యనే లక్ష్మి ప్రణతి తన పుట్టినరోజు జరుపుకోగా, ఆమెకు అతి పెద్ద కానుక ఇచ్చాడు.

హైదరాబాద్‌ శివారులో అత్యంత ఖరీదైన ఒక ఫామ్‌ హౌస్ ను ఆమెకు బహుమానంగా ఇచ్చాడట. బర్త్‌ డే కానుకగా ఆమెకు ఆ ఫామ్‌ హౌస్‌ ను కానుకగా ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది. సిటీకి దూరంగా అత్యంత ప్రశాంత వాతావరణంలో ఉన్న ఆ ఫామ్‌ హౌస్ ను ఎన్టీఆర్‌ చాలా ఇష్టపడి కొనుగోలు చేశారు అంటూ సమాచారం అందుతోంది..2011 మేలో పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి లకు ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ అనే హై బడ్జెట్ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నారు..

CINEMATOGRAPHER ki FIAT CAr gift ga icchina producer gopala krishna!

samantha started exporting her clothing brand ‘saaki’ international!