in

Venky mama Turns Night Blind For ‘F3’!

విక్టరీ వెంకటేశ్, యంగ్ హీరో వరుణ్ తేజ, తమన్నా, మెహ్రీన్ నటించిన సూపర్ హిట్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఎఫ్ 2’.  అనిల్ రావిపూడి దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ తెరకెక్కుతోంది. మొదటి భాగంలో నటించిన వారందరూ సీక్వెల్ లో నటిస్తున్నారు. కాకపోతే.. సునీల్ పాత్ర ఒకటి కొత్తగా యాడ్ అవుతోంది. కొత్తగా పెళ్ళైన ఇద్దరు జంటల చిలిపి తగాదాలు, ఫ్రస్ట్రేషన్ నేపథ్యంలో మొదటి భాగం రూపొందితే..  రెండో భాగం డబ్బు చుట్టూ తిరగనుందట.

తోడల్లుళ్ళు వెంకీ, వరుణ్ తేజ ఇద్దరూ ‘ఎఫ్ 3’ లో డబ్బు కోసం కొట్టుకొంటారట. ఈ క్రమంలో వెంకీని రేచీకటి వేధిస్తుందట. ఈ నేపథ్యంలో వచ్చే కామెడీ సీన్స్ హిలేరియస్ గా ఉంటాయని చెబుతున్నారు. ఆ సీన్స్ ను అనిల్రా విపూడి అద్భుతంగా వర్కవుట్ చేశాడని సమాచారం.  ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఎఫ్ 3  మూవీ .. ఇప్పుడు మూడో షెడ్యూల్ లో ఉంది. ఆగస్ట్ 27న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అనిల్ .. షూటింగ్ ను శరవేగంగా చేస్తున్నాడట. మరి రేచీకటి పాత్ర వెంకీకి ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.

rashmika playing sai pallavi’s type of role in her next?

‘Jathi Ratnalu’ Beats ‘Baahubali-2’ Record!