in

rashmika playing sai pallavi’s type of role in her next?

సినిమా రంగంలో మగవాళ్ల కెరీర్ సుదీర్ఘకాలం కొనసాగినా అమ్మాయిల కెరీర్ మాత్రం కొంతకాలమే. ఆలోగానే వారు చకచకా సినిమాలు చేసేస్తుంటారు. అలా అవకాశాలు కూడా రావాలి. రష్మిక విషయంలో అదే జరిగింది. 2017లో ‘ఛలో’ సినిమాతో తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టింది ఈ భామ. దానికి ఏడాది ముందు కిర్రాక్ పార్టీతో కన్నడ రంగంలో పరిచయమైంది. కానీ తెలుగులో ఛలో హిట్ అవడం, ఆ తర్వాత గీతగోవిందం కూడా హిట్టవడంతో గోల్డెన్ భామగా రష్మిక పేరుతెచ్చుకుంది. ఇప్పుడు బిజీగా ఆర్టిస్టు ఎవరంటే రష్మిక పేరు కూడా అందులో వినిపిస్తుంది.

ఇలా ఇంకెంత కాలం కొనసాగుతుందో చెప్పలేం. తాజాగా ఆమె ఓ రైతు పాత్రలో కనిపించబోతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తను పొలం దున్నుతున్నట్లు ఉన్న ఫొటోను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇంతకుముందు హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి ఫిదాలో పోషించిన పాత్ర తరహాలోనే ఇది కూడా ఉంటుందా అన్న అనుమానం ఉంది. కార్తీతో కలిసి సుల్తాన్ అనే సినిమాలో రష్మిక నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంది. ఈ వీడియోనే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యింది.

Balakrishna’s passion for cinema unmatchable, says pragya jaiswal!

Venky mama Turns Night Blind For ‘F3’!