in

struggling beauty Catherine Tresa bags 2 more offers in tollywood!

క కేథరీన్ నటించిన లాస్ట్ సినిమా విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమా భారీ డిజాస్టర్ తర్వాత మళ్ళీ కనిపించలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ తో పోటీ పడలేక రేస్ లో వెనకబడిపోయింది. సినిమా అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. దాంతో ఇక టాలీవుడ్ లో కేథరీన్ కెరీర్ క్లోజ్ అని అందరు అనుకుంటున్నారు. కాని కేథరీన్ అకౌంట్ లో ఇప్పుడు రెండు సినిమాలున్నాయని సమాచారం. ఇప్పటికే నందమూరి కళ్యాణ్ రాం నటిస్తున్న సినిమాలో కేథరీన్ ఒక హీరోయిన్ గా నటిస్తోందట.

అయితే తాజాగా కేథరీన్ కి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించబోతున్న లేటెస్ట్ సినిమాలో కేథరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో యంగ్ హీరో శ్రీవిష్ణు సరసన నటించనున్నాడు. బాణం, బసంతి సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ చైతన్య దంతులూరి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడని సమాచారం. మొత్తానికి కేథరీన్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో లైం లైట్ లోకి రాబోతోంది. చూడాలి మరి ఈ సినిమాలతో మళ్ళీ ఫాం లోకి వచ్చి హీరోయిన్ గా సెటిలవుతుందో లేదో.

uppena!

New Headache For Balayya And Boyapati Movie!