in

New Headache For Balayya And Boyapati Movie!

ఎందుకో..బాల‌కృష్ణ అనగానే హీరోయిన్లు ఠారెత్తిపోతున్నారు. కాల్షీట్లు కుద‌ర‌కో, పారితోషికాలు ఎక్కువ డిమాండ్ చేయ‌లేకో.. ముందై సైడ్ అయిపోతున్నారు. ప్ర‌స్తుతం… బోయ‌పాటి శ్రీ‌ను తో ఓ సినిమా చేస్తున్నాడు బాల‌య్య‌. ఈ సినిమా కోసం హీరోయిన్ల‌ని వెద‌క‌డం క‌ష్ట‌మైపోయింది. చివ‌రికి.. ఫామ్ లో లేని పూర్ణ లాంటి హీరోయిన్ల‌తో సెట్ అయ్యాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం గ‌ర‌మ్ గ‌ర‌మ్ ఐటెమ్ సాంగ్ కావ‌ల్సివ‌చ్చింది. ఆ పాట కోసం స్టార్ హీరోయిన్ల‌ని సంప్ర‌దిస్తున్నాడ‌ట బోయ‌పాటి శ్రీ‌ను. కానీ.. ఏ ఒక్కరూ సిద్ధంగా లేరని టాక్‌.

ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లు లేరు. కనీసం ఐటెమ్ పాట‌కైనా పేరున్న హీరోయిన్ ని ప‌ట్టుకొద్దామ‌న్న‌ది బోయ‌పాటి ప్లాన్‌. కానీ… హీరోయిన్లంతా మొహ‌మాటం లేకుండా `నో` చెప్పేస్తున్నార్ట‌. దాంతో… ఐటెమ్ గాళ్ కోసం వెదుకులాట‌లో ప‌డిపోయాడు బోయ‌పాటి. మేలో బాల‌య్య సినిమా రాబోతోంది. ఏప్రిల్ క‌ల్లా.. షూటింగ్ పూర్తి చేసుకోవాలి. వ‌చ్చే నెల‌లో ఐటెమ్ గీతాన్ని లాగించేయాలి. ఈ లోగా హీరోయిన్ ని సెట్ చేసుకోవాలి. ఈనెలాఖ‌రు వ‌ర‌కూ హీరోయిన్ వేట‌లో ఉండి, ఎవ్వ‌రూ దొర‌క్క‌పోతే, బాలీవుడ్ నుంచి ఓ కొత్త నాయికని తెచ్చుకోవాల‌న్న‌ది ప్లాన్.

struggling beauty Catherine Tresa bags 2 more offers in tollywood!

shivathmika rajashekar all set to make her kollywood debut!