తెలుగు ప్రేక్షకుల చేత “జేజమ్మ”,” బొమ్మాలి” అని పిలిపించుకొనే బంగారులాంటి అవకాశాన్ని వదులుకున్న మమతా మోహన్ దాస్. అరుంధతి సినిమా లో అరుంధతి క్యారెక్టర్ కి మొదట మమతా మోహన్ దాస్ ను తీసుకున్నారు, కానీ కొంతమంది శ్యాం ప్రసాద్ రెడ్డి సినిమా అంటే రెండు, మూడు సంవత్సరాలు పడుతుంది అని చెప్పారు, ఆ మాటలకు భయపడిన మమతా మోహన్ దాస్ ఆ అవకాశాన్ని వదులుకున్నారు. తరువాత జరిగిన సెలక్షన్ లో అనుష్కను కలిశారు, అప్పుడు ఆమె ” విక్రమార్కుడు” సినిమా చేస్తున్నది,
విషయం తెలిసిన రాజా మౌళి అనుష్క ను, ఒప్పుకో,నీ కెరీర్ టర్న్ అవుతుంది, శ్యాం ప్రసాద్ రెడ్డి మూవీ ఆఫర్ రావటం చిన్న విషయం కాదు అని ఎంకరేజ్ చేసారు. అనుష్క మరో మాట లేకుండా ఎస్ చెప్పేసింది, ఆమె అందం, రాజసం ఉట్టిపడే ఆమె శరీర సౌష్టవం, ఆ పాత్రకు వన్నె తెచ్చాయి, ఆమె చేత అద్భుతమయిన నటన చేయించి కోడి రామకృష్ణ గారు, జేజమ్మ పాత్రను చిరస్థాయిగా నిలిపారు. “జేజమ్మ” గ ,” బొమ్మాలి ” గ తెలుగు ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయారు అనుష్క గారు. అందుకే నటులకు అందం, అభినయమే కాదు పిసరంత అదృష్టం కూడా కలిసి రావాలి అంటారు కొంతమంది సినీ పండితులు.,