in

finally, anushka signed her next with a new director!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క బాహుబలి చిత్రం తరువాత దాదాపు ఈ ఏడేళ్లలో ఆమె చేసినవి రెండు మూడు సినిమాలే . బాహుబలి తరువాత భాగమతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనుష్క ఆ తరువాత చేసిన నిశ్శబ్దం టైటిల్ కి జస్టిఫికేషన్ ఇస్తూ సైలెంట్ గా ప్లాప్ ని మూట గట్టుకుంది. ఈ సినిమా తరువాత అనుష్క నెక్స్ట్ సినిమా ఏమిటి అన్న ఆసక్తి ఆమె అభిమానుల్లో నెలకొంది. నిశ్శబ్దం సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా కూడా అనుష్క నెక్స్ట్ సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు.

ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్న అనుష్క ఫైనల్ గా ఓ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో అనుష్క అతనితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ కొత్త దర్శకుడి పేరు రమేష్ అని సమాచారం. ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే రానుంది. ఇదే బ్యానర్ లో గతంలో భాగమతి చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా సక్సెస్ తరువాత మళ్ళీ అదే బ్యానర్ లో అనుష్క సినిమా చేస్తుందంటూ వస్తున్నా వార్తలు ఆసక్తికరంగా మారాయి ..సో త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అనౌన్సమెంట్ రానుంది..

anushka nu ‘arundhati’ ga marchina mamatha mohan das!

zombie reddy!