అర్జున్ కపూర్ తో ‘సర్దార్ అండ్ గ్రాండ్ సన్’ సినిమా పూర్తి చేసింది రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పటికే మూడు చిత్రాల్లో కలిసి నటించిన సిద్దార్థ్ మల్హోత్రాతో మరోసారి ‘థాంక్ గాడ్’ సినిమాలో రొమాన్స్ చేస్తోంది. ఇక అజయ్ దేవగణ్ తో కూడా ‘దే దే ప్యార్ దే’ తరువాత ‘మే డే’ అనే సినిమాలో రకుల్ నటిస్తోంది. ఇందులో అమితాబ్ కూడా నటిస్తుండటం మరో విశేషం. హిందీలో ఇలా అయిదు సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో మాత్రం రెండే చిత్రాలు చేస్తోంది.
తమిళంలో ఒక సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. నితిన్ తో ‘చెక్’ సినిమాలో నటిస్తోంది రకుల్. వైష్ణవ్ తేజ్ తో డైరెక్టర్ క్రిష్ మూవీలోనూ ఈమే కథానాయికగా నటించింది. మరోవైపు, తమిళంలో శివకార్తికేయన్ తో ‘అయలాన్’ అనే సినిమా చేసింది. ప్రస్తుతం అది పొస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. చూస్తుంటే… రకుల్ తెలుగు, తమిళ సినిమాల కంటే హిందీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. మరి, మన థర్టీ ఇయర్స్ సీనియర్స్ సుందరి ముంబైలో టాప్ స్టార్ గా ఎదుగుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!