మహేష్ బాబు కెరీర్ తోలి రోజుల్లో మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం “మురారి”. ఆ చిత్ర దర్శకుడు అయిన కృష్ణ వంశీ గారు, ఆ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయం తో ఒక దృశ్య కావ్యంగా మలిచారు. సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది, అయిన కూడా ఆ చిత్రం 100 డేస్ ఫంక్షన్ చేయలేదు, అందుకు కారణం? ఆ చిత్రం మొదలయినప్పటి నుంచి, నిర్మాత రామలింగేశ్వర రావు కు, కృష్ణ వంశీ కు మధ్య అనేక విభేదాలు ఏర్పడ్డాయి. షూటింగ్ స్పాట్ కు వెళ్లడం మానేసి, మొత్తానికి చిత్రాన్ని పూర్తి చేసారు రామలింగేశ్వర రావు గారు. పిక్చర్ రిలీజ్ అయినా తరువాత పబ్లిసిటీ కి కూడా చాల భారీగా ఖర్చు చేసారు రామలింగేశ్వర రావు గారు.
చిత్రం భారీ విజయం సాధించింది, హైదరాబాద్ లో, విజయవాడలో ఒకే రోజు వంద రోజుల పండుగ చేయాలనుకున్నారు, హైదరాబాద్ లో ఫంక్షన్ పూర్తి అవగానే, చార్టెడ్ ఫ్లైట్ లో అందరిని విజయవాడకు తరలించి అక్కడ ఫంక్షన్ చేయాలనీ చాల భారీ ప్లానింగ్ చేసారు రామలింగేశ్వర రావు గారు, కానీ ఆ ఫంక్షన్ కు డైరెక్టర్ కృష్ణ వంశీ రాకూడదు అనే షరతు పెట్టారు. డైరెక్టర్ లేకుండా ఫంక్షన్ చేయడానికి మహేష్ బాబు ఒప్పుకోలేదు, ఫంక్షన్ చెయ్యకపోయినా ఫరవాలేదు, డైరెక్టర్ లేకుండ ఫంక్షన్ ఎలా చేస్తారు అని అభ్యంతరం చెప్పడం తో ఫంక్షన్ ఆగిపోయింది, లేకుంటే “మురారి” వంద రోజుల పండగ కూడా చాల భారీ స్థాయి లో జరిగి ఉండేది.