in

Warina Hussain To Make Her Tollywood Debut Opposite Jr NTr!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దీని తర్వాత తారక్ తన ఆల్ టైం మరో లవబుల్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో రెండో సినిమా చెయ్యనున్నారు. దీనిపై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి మరికొన్ని రోజుల నుంచి పలు ఇంట్రెస్టింగ్ గాసిప్స్ వినిపిస్తున్నాయి.

వాటి ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ వరీనా హుసేన్ ఫిక్స్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని టాక్ వచ్చింది. మరి దీనిపై ఆమె పాక్షికంగా కన్ఫర్మేషన్ ను ఇచ్చేసింది. తన కార్ లో వెళ్తూ ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఓ గోడపై “ఎన్ టి ఆర్” అని రాసి ఉంది. అంటే సినిమా సిట్టింగ్స్ కోసమో లుక్ టెస్ట్ కోసమో అన్నట్టుగా కన్ఫర్మ్ అనుకోవచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ చిత్రానికి త్రివిక్రమ్ మార్క్ “అయినను పోయి రావలె హస్తినకు” అనే టైటిల్ ను లాక్ చెయ్యగా హారికా హాసిని క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు..

thana director kosam 100 days function nu cancel chesina mahesh babu!

samantha in talks for ‘zombie reddy’ sequel!