in

disha patani receives death threatening calls from Pakistan!

రుణ్ తేజ్ హీరోగా తెరకెక్కించిన ‘లోఫర్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన దిశా పటానీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ఇటీవల ఆమె నటించిన ‘భాగీ 2’, ‘భాగీ 3’ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ తాజాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ‘రాధే’ సినిమాలో నటిస్తోంది. ఇలా ఒకవైపు సినిమాలు.. మరోవైపు ఫోటో‌షూట్లతో బిజీగా ఉన్న ఈ భామకు కొందరు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట.

ఇప్పుడు ఈ వార్త బీ-టౌన్‌లో హాట్ టాపిక్ అయింది. కొందరు దుండగులు దిశాకు కాల్ చేసి చంపేస్తామంటూ బెదిరిస్తున్నారట. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్లకు కూడా ఫోన్ చేసి దిశాను ఎవరూ కూడా కాపాడలేరని హెచ్చరిస్తున్నారట. దీనితో అలెర్ట్ అయిన పోలీసులు ఆ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ట్రేస్ చేసే పని పడ్డారు. ఫోన్ కాల్స్ అన్నీ కూడా పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు గుర్తించారట. ఈ కాల్స్ వెనుక అసలైన సూత్రధారి ఎవరన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారు.

YOUNG HERO VIJAY DEVERAKONDA IN DRIVE TELUGUSWAG EDITS

nani’s gang leader heroine roped in for surya’s next!