NTR నటించవలసిన ఒక అద్భుతం అయినా సినిమా “ఛాంగీష్ ఖాన్ ” దాని స్క్రిప్ట్ ను విజయవాడ రోడ్ మీద కాల్చివేసిన నిర్మాత కాకర్ల కృష్ణ గారు. తెన్నేటి సూరి రచించిన ఛాంగీష్ ఖాన్ నవల ఆధారం గ వల్లభనేని వెంకటేశ్వర్ రావు తయారుచేసిన స్క్రీన్ప్లే విన్న యెన్.టి.ఆర్ ఆ సినిమా నటించాలనుకున్న, అయన రాజకీయ ప్రవేశం వలన ఆ సినిమా నటించటం వీలు కాలేదు. ఆ టైటిల్ ని వరుసగా రిజిస్టర్ చేస్తూ, ఎప్పటికి అయినా యెన్,టి.ఆర్. చేత ఛాంగీష్ ఖాన్ పాత్ర చేయించాలి అనుకున్నారు కాకర్ల కృష్ణ. కానీ ఆ ఫైల్ ని దొంగలించిన ఒక వ్యక్తి, డైరెక్టర్ మల్లికార్జున రావు గారికి ఇచ్చాడట,
ఆ సబ్జెక్టు హీరో కృష్ణ గారికి చెప్పటం జరిగింది, ఈ సబ్జెక్టు కాకర్ల కృష్ణ గారిది అని తెలిసిన కృష్ణ గారు ఆయనకు ఫోన్ చేసి ఏంటి మీ సబ్జెక్టు ఎవరికయినా ఇచ్చేశారా అని అడిగారట. తన సబ్జెక్టు అక్కడ కు చేరిన విషయం తెలిసిన కాకర్ల కృష్ణ గారు ఎంతో మానసిక వేదనకు గురి అయ్యారు, ఆ ఫైల్ తనకు తిరిగి పంపించమని అడిగారట, కృష్ణ గారు ఆ ఫైల్ ను కాకర్ల కృష్ణ గారికి చేరవేసారట, అంత మంచి సబ్జెక్టు ను యెన్,టి,ఆర్, తో చేయలేక పోయానే అనే బాధ తో ఆ ఫైల్ ను విజయవాడ నడి రోడ్ మీద కాల్చి పడేశారట కాకర్ల కృష్ణ గారు. ఆ విధం గ యెన్.టి.ఆర్. నటించ వలసిన ఒక కళా ఖండం కథ బెజవాడ నడి రోడ్డు పైన కాలి బూడిదయింది..