తాను నటిస్తున్నప్పుడు సెట్ లో కెమరామెన్, కో డైరెక్టర్, డైరెక్టర్ తప్ప ఎవరు ఉండకూడదు అని ఆంక్షలు విధించిన మహేష్ బాబు. అదేమిటి ఎందుకు ఆలా అనుకోకండి, అది ఇప్పటి విషయం కాదు. గురువు గారు దాసరి గారు 1979 లో ” నీడ” అనే చిత్రం లో మహేష్ మీద కొన్ని సన్నివేశాలు తీశారు , బాల నటుడిగా మహేష్ మొదటి చిత్రం అది. ఆ తరువాత నిర్మాత శాఖమూరి రామచంద్ర రావు 1983 లో నిర్మించిన “పోరాటం” అనే చిత్రం లో కృష్ణ గారు హీరో గ నటించారు. ఆ చిత్ర దర్శకుడు అయిన కోడి రామకృష్ణ ఒక సారి తండ్రి తో కలసి సెట్ కి వచ్చిన మహేష్ ను చూసి, అందులో కృష్ణ గారి బ్రదర్ పాత్రలో మహేష్ ను పెడదామని అడిగారట,
వద్దు, వద్దు, వాడి అల్లరి నువ్వు భరించలేవు అన్నారట కృష్ణ గారు, అయినా కూడా పట్టు పట్టి కోడి రామకృష్ణ ,కృష్ణ గారిని ఒప్పించారట. అప్ప్పుడు మహేష్ కు 9 ఏళ్ళు, షూటింగ్ కి వచ్చిన మహేష్ తెగ అల్లరి చేయటమే కాకా తాను నటిస్తున్నప్పుడు సెట్ లో ఎవరు ఉండకూడదు అని తెగేసి చెప్పేశాడట. గత్యంతరం లేక అలాగే చేసారట, క్లిష్టమయిన పాత్రను అతి సునాయాసం గ నటించేస్తున్న మహేష్ ను చుసిన నిర్మాత డూండి గారు, ఇతను భవిష్యత్తులో చాల పెద్ద నటుడు అవుతాడు అని జోస్యం చెప్పారట, అది నిజం అయ్యి ఇపుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గ సినీ పరిశ్రమలో తన ప్రయాణం కొనసాగిస్తున్నారు మహేష్ బాబు. మొత్తానికి గురు, శిష్యులు ఇద్దరు కలసి తెలుగు పరిశ్రమకు ఒక మంచి నటుడిని అందించారు.