in

Keerthy Suresh facing marriage pressure from parents?

నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది కోలీవుడ్ భామ కీర్తిసురేశ్‌. ఆ తర్వాత ఎంసీఏ, అజ్ఞాతవాసి చిత్రాలతో అలరించింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన మహానటి చిత్రంతో బాక్సాపీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం కీర్తిసురేశ్ ను స్టార్ హీరోయిన్ల జాబితాలో చేర్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలతో బిజీగా ఉన్న ఈ సుందరిపై తల్లిదండ్రులు పెండ్లి విషయమై ఒత్తిడి తీసుకొస్తున్నారట.

30 ఏండ్లు నిండేసరికి కీర్తిసురేశ్ సెటిల్ అవ్వాలని ఆమె తల్లిదండ్రులు కోరుకుంటున్నట్టు కోలీవుడ్ వర్గాల టాక్‌. అయితే కీర్తి సురేశ్ మాత్రం మరికొంత కాలం యాక్టింగ్ కెరీర్‌ను కొనసాగించాలనుకుంటుందట..ఈ మేరకు తన పెండ్లి ప్లాన్ ను వాయిదా వేసుకున్నదంటూ కోలీవుడ్ లో జోరుగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం కీర్తిసురేశ్ సర్కార్ వారి పాటలో హీరోయిన్ గా నటిస్తోంది.

sakshi vaidhya replaces rashmika for akhil’s next!

upasana in quarantine with ram charan!