అక్కినేని బుల్లోడు అఖిల్.. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రం చేస్తున్నాడు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ క్రేజీ వెంచర్.. 2021 జనవరిలో థియేటర్స్ ముంగిట సందడి చేయనుంది. ఇదిలా ఉంటే.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తరువాత స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ చేయబోతున్నాడు అఖిల్.
sakshi vaidhya replaces rashmika for akhil’s next!
ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో అఖిల్ కి జోడీగా రష్మిక మందన్న నటించే అవకాశముందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల కథానాయిక దొరికేసిందట. అఖిల్ 5వ సినిమాలో అతడితో రొమాన్స్ చేసేందుకు మోడల్ కమ్ హీరోయిన్ సాక్షి వైధ్యను ఎంపికచేశారట. దర్శకుడు సురేందర్ అభిప్రాయం ప్రకారం అఖిల్‌కు ఆమె సరైన జోడీగా ఉంటుందట