సుధా చంద్రన్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ మయూరి అంటే తెలుగునాట చాలామందికి తెలిసి ఉంటుంది. 1985 లో రామోజీ రావు గారు నిర్మించిన బయోపిక్ “మయూరి” చిత్రం ద్వారా పరిచయం అయ్యారు సుధా చంద్రన్. ప్రమాదవశాత్తు ఒక కాలు పోగొట్టుకొని,కుంగిపోకుండా, దేర్యంగా విధికి ఎదురుతిరిగి , జై పూర్ లెగ్ తో శాస్త్రీయ నృత్యకారిణిగా ఎదిగిన ఆమె జీవిత కథను మయూరి చిత్రం గ తెరకు ఎక్కించారు రామోజీ రావు గారు. ఇక్కడ విశేషం ఏమిటంటే తన జీవిత కధలో తానే నటించటం. ఇప్పటివరకు ఎన్నో బియోపిక్స్ వచ్చాయి, అందులో ఎవరో పేరున్న నటులు నటించటం జరిగింది, ప్రపంచ సినీ చరిత్రలో తన జీవిత చరిత్ర చలన చిత్రం లో తానే నటించిన ఘనత సుధా చంద్రన్ గారిది.
ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే సినిమా పూర్తి ఐన తరువాత రామోజీ రావు గారిని కలిసిన సుధాచంద్రన్ ముందు రామోజీ రావు గారు ఒక బ్లాంక్ చెక్ ఉంచి నీకు ఇష్టం అయినా అమౌంట్ వ్రాసికోమని చెప్పారట. వెంటనే పక్కన ఉన్న సుధా గారి నాన్న గారు, నా బిడ్డ జీవితాన్ని తెరమీద చూపించే ఆర్ధిక స్థోమత నాకు లేదు కానీ మీరు ఆ పని చేసారు కాబట్టి ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలము, అని ఆ చెక్ ను చింపి తెరిగి రామోజీ రావు గారి చేతిలో పెట్టి నమస్కరించి, కన్నీటి పర్యంతం అయ్యారట. ఆ తరువాత తన సొంత ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించిన రామోజీ రావు గారు దానికి ” మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్” అని పేరు పెట్టుకున్నారు..