అభిజిత్, అఖిల్‌లకు కాస్త ఎక్కువ క్రేజ్ దక్కడానికి మోనాల్ గజ్జర్ కారణం అనడంలో సందేహం లేదు. ఈ ముగ్గురి మద్య జరిగిన ట్రైయాంగిల్ స్టోరీ సీజన్ మొత్తానికే హైలైట్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన అభిజిత్‌ను నెటిజన్లు మోనాల్ విషయంలో రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. మోనాల్‌పై మీకు క్రష్ ఉందా.. హౌస్‌లో మీ ముగ్గురి మధ్య ఏం జరిగింది అంటూ ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారు.
అయితే తాజాగా అభిజిత్ అసలు నిజాలను రివిల్ చేసేశాడు. అభి మాట్లాడుతూ.. మోనాల్ విషయంలో అఖిల్‌కు, నాకూ ఏదో ఇష్యూ ఉండేది. కానీ ఎవరూ బయటపడేవారు కాదు. ఎవరి ఆట వాళ్లు ఆడారు. ఆమెపై నాకేమీ క్రష్ లేదు. ఒక కంటెస్టెంట్‌గా కూడా ఆమె నాకు కనెక్ట్ కాలేదు. షో చూసినవాళ్లంతా ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసిందనుకుంటున్నారు. కానీ నేనే ఆ అమ్మాయిని అవాయిడ్ చేశా. ఇది క్లియర్. తనెందుకో నాకు సెట్ కాలేదు.` అని చెప్పుకొచ్చాడు..