in

Pawan Kalyan – Rana movie titled as ‘Billa Ranga’!

వ‌న్ క‌ళ్యాణ్‌, ద‌గ్గుబాటి రానా ప్ర‌ధాన పాత్రల్లో మ‌ల‌యాళ హిట్ మూవీ ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్‌’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. సాగ‌ర్ కె.చంద్ర డైరెక్ష‌న్ లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్క‌తున్న ఈ సినిమా నిన్న అధికారికంగా లాంఛ్ అయింది. ఈ చిత్రానికి ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ 40 రోజులు కేటాయించిన‌ట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ఆసక్తికర టైటిల్స్ అన్ని  ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ టైటిల్ ఖరారు చేసింది చిత్రబృందం. కాన్సెప్ట్ కు తగ్గట్లు ఈ సినిమాకి ‘బిల్లా రంగా’ టైటిల్ యాప్ట్ అవుతుందని భావించారు. ఇక బిల్లాగా ప‌వ‌ర్‌స్టార్, రంగాగా రానా నటించనున్నారు. కాగా 1982లో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన ఈ క్లాసిక్ మూవీ అప్ప‌ట్లో పెద్ద హిట్ అయ్యింది.

super star mahesh babu creates new record on twitter!

Payal Rajput turns cop for ‘5Ws’!