in

RASHMIKA SHARES HER FITNESS SECRETS!

ష్మిక ఉండేదే చాలా బక్క పలుచగా. అయినా.. ఆమె జింలో రెగ్యులర్ గా కసరత్తులు చేస్తుంది. ఇటీవల ఆమె హైదరాబాద్ కి చెందిన ఒక ఫిట్నెస్ ట్రైనర్ ని రిక్రూట్ చేసుకొంది. అతను చెప్పినట్లుగా ఫిట్ నెస్ సూత్రాలు ఫాలో అవుతోంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఇతర మహిళలకు కూడా టిప్స్ చెప్తోంది. మహిళలు బరువులు ఎత్తొద్దని చాలామంది అంటారు. కానీ అది తప్పు అంటోంది ఈ భామ.

“వెయిట్స్ లిఫ్ట్ చేస్తేనే తొందరగా కొవ్వు తగ్గుతుంది. మజిల్ పెరిగితే బాడీ ఫిట్ గా ఉంటుంది. అందుకే మగవాళ్ల రేంజులో కాకపోయినా… ఆడవాళ్లు కూడా బరువులు ఎత్తాలి,” అని రష్మిక సలహా ఇస్తోంది. అంతేకాదు, బాడీ కూడా మంచి రంగుతో నిగనిగలాడుతోందట. రష్మిక ఇప్పటికే “పుష్ప” అనే సినిమాలో నటిస్తోంది. అలాగే, శర్వానంద్ హీరోగా రూపొందే “ఆడాళ్ళూ మీకు జోహార్లు” సినిమా కూడా సైన్ చేసింది.

Chiranjeevi welcomes Kajal and Gautam to ‘Acharya’ sets!

alia bhatt wraps up her first schedule for ‘rrr’!