in

Chiranjeevi welcomes Kajal and Gautam to ‘Acharya’ sets!

చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న స్నేహితుడు బిజినెస్ మేన్ గౌత‌మ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్ళి అక్టోబ‌ర్ 30న ముంబై తాజ్ మ‌హ‌ల్ ప్యాలెస్‌లో జరిగింది. అయితే అప్పటికే ఆచార్య షూటింగ్‌లో పాల్గొంటున్న కాజల్ వివాహ వేడుకల సందర్భంగా షూటింగ్‌కు కాస్త గాప్ ఇచ్చింది. కాజ‌ల్ అగర్వాల్ మంగళవారం ఉదయం `ఆచార్య` షూటింగ్ లో జాయిన‌య్యారు. ప్రస్తుతం ఆచార్య చిత్రీకరణ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది.

అయితే సినిమా కోసం హైద‌రాబాద్ కోకాపేట లో వేసిన భారీ సెట్లో మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ పై పాట చిత్రీకరణ జరుగుతోంది. మంగళవారం ఉదయం కాజ‌ల్ భ‌ర్త గౌత‌మ్ కిచ్లు ఆచార్య సెట్స్‌కి వీచ్చేసి చిత్ర బృందాన్ని స‌ర్‌ప్రైజ్ చేశారు. కాజ‌ల్ – కిచ్లు జంట‌కు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త జంటతో దండ‌లు మార్పించి కేక్ కట్ చేయించిచారు. దానితో పాటు మెగాస్టార్ చిరంజీవి కొత్త జంట‌ను ఆశీదర్వదించారు.

Rajinikanth Names His Party Makkal Sevai Katchi?

RASHMIKA SHARES HER FITNESS SECRETS!