మోనాల్ ఓట్లు తక్కువ ఉన్నప్పుడు మాత్రం, ఆ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న అంచనాలు విశ్లేషకుల ఊహకు కూడా అందడం లేదు. దాదాపు పలు సోషల్ మీడియా పోర్టల్స్తో పాటు, ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ వారం మోనాల్ ఎలిమినేట్ అవుతుందని అంచనాలు వేసినా, ఆఖరి నిమిషంలో బిగ్ బాస్ నిర్వాహకులు మనసు మార్చుకున్నారని, దీంతో ఎలిమినేట్ కావడం లేదని ఆయా పత్రికలు సవరణ, వివరణ ఇస్తున్నాయి. దీంతో ప్రేక్షకులలో, మోనాల్ ని ప్రేక్షకుల ఓట్ల తో నిమిత్తం లేకుండా బిగ్ బాస్ నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా ప్రతివారం కాపాడుతూ ఉన్నారని అభిప్రాయం బలంగా ఏర్పడింది.
అసలు ఆమెకు ఎవరు ఓట్లు వేస్తున్నారో, బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను ఎందుకు కాపాడుతున్నారో అర్థం కావడం లేదంటూ అత్తారింటికి దారేది సినిమా స్టైల్ లో మీమ్స్ తయారుచేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఆమె విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు ఓట్లను పట్టించుకోకుండా ప్రేక్షకులను బకరాలు చేస్తున్నారని అంటూ పలువురు ఇప్పటికే ఓటు వేయడం, షో ని సీరియస్ గా ఫాలో కావడం మానేశారు. బిగ్ బాస్ నిర్వాహకుల తీరు- మోనాల్ ని పంపించం, ప్రేక్షకులనుండి వచ్చిన ఓట్లను పట్టించుకోము, మీ దిక్కున్నచోట చెప్పుకోండి అన్నట్లుగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.