in

NANI 28TH MOVIE ANNOUNCEMNET FOR DIWALI!

టాలీవుడ్ హీరో నాని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. నాని 28వ చిత్రంగా వ‌స్తున్న ఈ ప్రాజెక్టును దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని రేపు అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. సినిమా డైరెక్టర్ స‌హా ఇత‌ర వివ‌రాలను ప్ర‌క‌టించనున్నారు. నాని ప్ర‌స్తుతం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ట‌క్ జ‌గదీష్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే షూటింగ్ రీస్టార్ట్ అయిన‌ ఈ చిత్రం త్వ‌ర‌లోనే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకోనుంది. మ‌రోవైపు ట్యాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్య‌న్ డైరెక్షన్ లో నాని 27వ సినిమా శ్యామ్ సింఘ ‌రాయ్ కు కూడా ఇప్ప‌టికే ప‌చ్చజెండా ఊపాడు. తాజాగా ఒకే చేసిన మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ స‌హా మ‌రికొన్ని ప్రాజెక్టుల‌ను కూడా లైన్ లో పెట్టాడు. మొత్తానికి నాని బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌ను ఓకే చేస్తూ ఫుల్ జోష్ తో ఉన్నాడు.

ANIL RAVIPUDI MULTI STARRER WITH NAG AND AKHIL!

NTR GARI AUTOGRAPH THEESUKONI VAARINE DIRECT CHESE STHAIKI YEDIGINA DASARI!