లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీ సంస్థల హడావిడి ఎక్కువైంది. ఇప్పటికే పలు ఓటీటీ సంస్థలు సినిమాలకోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ `ఆహా` పేరుతో లోకల్ కంటెంట్ తో పాటు సినిమాల కోసం ప్రత్యేకంగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌ని నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లకు పోటీగా మొదలుపెట్టి షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆహా వేదికగా పలు చిన్న సినిమాలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విదులైన కలర్ ఫోటో సినిమాకూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఆహా ప్రమోషన్స్ కోసం ఏకంగా స్టార్ రంగంలోకి దిగితున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని కోడలు పిల్ల సమంత తో ఓ టాక్ షోను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్ ప్రోమోను విడుదల చేసింది ఆహా సంస్థ. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా సూపర్ ఫాంలో ఉన్న సమంత ప్రస్తుతం సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ ల మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది.