in

rana in shobhan babu biopic?

అలనాటి అందాల నటుడు, సోగ్గాడు శోభన్‌బాబు బయోపిక్‌ కూడా తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. మరో ముఖ్య విషయమేంటంటే.. ఇందులో శోభన్‌బాబుగా దగ్గుబాటి రానా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రానా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘అరణ్య’ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉండగా… ‘విరాటపర్వం’ కాస్త షూటింగ్ మిగిలి ఉంది. గుణశేఖర్‌ డైరెక్షన్లో ‘హిరణ్య కశ్యప’కు ఓకే చెప్పినప్పటికీ అది ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు.

ప్రస్తుతం గుణశేఖర్ ‘శాకుంతలం’ అనే పాన్ ఇండియా సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. శోభన్‌బాబు బయోపిక్‌ ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ అందాల నటుడి పాత్రకు రానా సరిపోతాడా? లేదా? అన్నదానిపై మాత్రం చర్చ నడుస్తోంది. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లో బయోపిక్‌లు ఊపందుకున్నాయి. అలనాటి నటి సావిత్రి జీవితకథతో తెరకెక్కిన ‘మహానటి’ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో అదే స్ఫూర్తిగా ప్రముఖుల జీవితకథలతో సినిమాలు తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు.

ANCHOR ANASUYA TO PLAY DEVADASI ROLE!

then kiara advani, now eesha rebba!