ప్రముఖ సింగర్ గీతామాధురి తెలుగు బిగ్ బాస్ రియాలిటీషోపై ఓ సెటైర్ వేసింది. ఇప్పటికే బిగ్ బాస్‌లో పాల్గొని బయటకొచ్చిన ఎందరో కంటిస్టెంట్లు ఈ షోపై పలు రకాలుగా నెగెటివ్ కామెంట్స్ చేయడం చూశాం. ఈ క్రమంలోనే తాజాగా గీతామాధురి రియాక్ట్ అవుతూ ఓ సెటైర్ వేయడం జనాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ నాలుగో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. గత సీజన్లతో పోల్చితే జనాలకు అంతగా తెలిసిన కంటిస్టెంట్లు లేకపోయినప్పటికీ.. బిగ్ బాస్ టాస్కులు, పార్టిసిపెంట్స్ రొమాంటిక్ కిక్‌తో ఫర్వాలేదనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇటీవలే బిగ్ బాస్ మూడో సీజన్ కంటిస్టెంట్ తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ బిగ్‌బాస్ వల్ల తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యానని చెప్పి చర్చలకు తెరలేపింది. అంతటితో ఆగక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ఫిమేల్ కంటెస్టెంట్లు కూడా తమ అనుభవాలను వెల్లడించాలని కోరింది..హౌస్ నుంచి బయటకొచ్చిన పిక్ షేర్ చేస్తూ ”2 సంవత్సరాల క్రితం ఫొటో ఇది. బరువుతగ్గి సన్నగా కావాలనుకునే వారికి నా సలహా ఒక్కటే.. బిగ్‌బాస్‌కు వెళ్ళండి” అని పేర్కొంది. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్ చూసి గీత చెప్పిన దాంట్లో దాగిఉన్న అర్థమేమిటి? అని చర్చల్లో మునిగిపోయారు జనం..